బచ్చన్నపేట (జనం సాక్షి):
బచ్చన్నపేట శివారు ఎద్దుగూడెం లో మహిళల ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయం వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని, అమ్మవారికి నైవేద్యలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ బోనాలతో ఎద్దుగూడెంలో సందడి వాతావరణం నెలకొంది. గత ఐదు రోజుల నుండి గ్రామంలో పోచమ్మ పండుగ యాగాలు ప్రత్యేక పూజలు విగ్రహ ప్రతిష్ట చేసి పాడి పంటలను తమ పిల్లాపాపలను సల్లంగా దీవించాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.చుట్టాలు బంధువులు తో, విద్యుత్ కాంతులతో గ్రామం కళకళలాడింది.సంతోషంగా పోచమ్మ పండుగ కార్యక్రమాన్ని ఎద్దుగూడెం గ్రామస్తులు వారి బంధువులు పిల్లాపాపలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
చల్లగా చూడు పోచమ్మ తల్లి




