చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

 

 

 

దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 26 దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీర నారి చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకొని సోమవారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆమె పోరాటం చేసిందని అన్నారు రజాకర్ల కాలంలో ఐలమ్మ సాయిధ పోరాటం చేసి పదివేల ఎకరాల భూములను పేద బడుగు బలహీన వర్గాలకు అందించిందని కొనియాడారు ఐలమ్మ చేసిన పనులను ప్రజలకు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు