హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 91కిలోల గంజాయిని శనివారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చాదర్‌ఘాట్ వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.