Thursday, 5 November 2026

చార్‌ధామ్‌ యాత్రికులకు సాయంపై ముఖ్యమంత్రి ఆదేశం

అందరిని భద్రంగా తీసుకురావాలి
ఉచితంగా రవాణా, భాజన, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచన
హైదరాబాద్‌న చార్‌దామ్‌ యాత్రకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న తెలుగు యాత్రికులందరినీ భద్రంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాట్లపై ఉన్నస్ధాయి సమీక్ష జరిపారు. ఇప్పటికే కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌ ఉత్తరాఖండ్‌ చేరుకుని సహాయక చర్చలను సమీక్షిస్తున్నారని, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సంజయ్‌కుమార్‌, టి రాధాలను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించినట్లు ముఖ్యంంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 1100 మంది రాష్ట్రానికి పయనమైనట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఏపి భవన్‌, రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోలు రూంలకు ఇప్పటివరకూ 973 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు. ఏపీ భవన్‌ నుంచి వెళ్లిన రెండు సహాయక బృందాల్లో ఒకటి డెహ్రాడూన్‌లో, మరొకటి హరిద్వార్‌లో సహాయక చర్చల్లో నిమగ్నమైనట్లు అధికారులు వివరించారు,. సహాయక కేంద్రాలకు చేరుకున్న యాత్రికులందరికీ ఉచిత భోజనం రవాణా వైద్యసేవలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకూ 23 హెలికాప్టర్లు నిరంతరంగా కొండలనుంచి యాత్రికులను తరలిస్తున్నాయని ఢిల్లీ హరిద్వార్‌ నుంచి ఉచితంగా రైళ్లు, బస్సుల్లో తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *