చింతకుంట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి నవంబర్ 14 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని చింతకుం గ్రామంలో సోమవారం నాడు పి. శ్రీరాములు అధ్యక్షతన జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గం నుండి ఉన్నత స్థానానికి ఎదిగి రాజ్యాంగ రూపొందించిన అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
వెనుకబడిన వర్గాల నుండి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ తమ వర్గానికి చేయూతనిచ్చి అందరి అభివృద్ధికి పాటు పడిన రోజే అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చిన వారు అవుతారు అన్నారు. యువకులు విద్యావంతులు చదువులో రాణించి అంబేద్కర్ స్ఫూర్తిని అర్థం చేసుకోని ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ పసునూరి సరస్వతమ్మ, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, పిఎసియస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి,సర్పంచ్ పంది రుద్రమ శ్రీను , ఉపసర్పంచ్ యేకుల సురేష్, ఉపాధ్యాయులు శ్రీరాములు, గ్రామ వార్డు మెంబర్ లు సరిత గిరి, ముత్యాలు, సుకన్య రాజు, బీఎస్పీ నాయకులు ఎం.కే.ఆర్ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజారావు, రమావత్ రమేష్, కృష్ణ మరియు నియోజకవర్గ మండల వివిధ పార్టీల అధ్యక్షులు, మండల వివిధ గ్రామాల సర్పంచ్లు, మరియు జైభీమ్ యూత్ సభ్యులు హరికృష్ణ, గిరిబాబు , నాగేష్ ,నాగార్జున, సహదేవ్, వెంకటయ్య, కిరణ్ , నాగరాజు, రాకేశ్, శ్రావణ్, బన్నీ, అజిత్, రాజశేఖర్, శ్రావణ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
చింతకుంట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన దేవరకొండ శాసనసభ్యులు




