నాచారం(హైదరాబాద్): తెలంగాణ కోసం పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సాయినాథ్ (22) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లాపూర్‌కు చెందిన సాయినాథ్ బుధవారం ఉదయం పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన సాయినాథ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతిచెందాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




