రెండో భార్యపై దాడి..కొడుకు మృతి
సంగారెడ్డి,ఏప్రిల్20(జనంసాక్షి): పటాన్చెరు మండలం చిట్కుల్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం సుబ్బరాజు, లక్ష్మీని రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇవాళ రెండో భార్య, ఆమె కొడుకుపై సుబ్బరాజు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రెండో భార్య కొడుకు చైతన్య సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. లక్ష్మీ తీవ్రంగా గాయపడింది. దాడి అనంతరం సుబ్బరాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు లక్ష్మీని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




