వరంగల్ ఈస్ట్, మే 30 (జనం సాక్షి)33 వ డివిజన్ కీర్తి బార్ నాలా కల్వర్టు నిర్మాణం దగ్గర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు మాట్లాడుతూ శాఖరాసికుంట 2015 జనవరి 5వ తారీఖున శాఖరాశి కుంట వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి మూడు రోజులు మీ దగ్గర (దావత్ )చేసుకుంటా అని ప్రగల్బాల మాటలకు నాంది ఈ శాఖరాసికుంట (మాదిగలకు మురుకు కాలువల పక్కనే ఇండ్లు అని నిదర్శనానికి ఈ శాఖ రాసి కుంట) కీర్తి బార్ దగ్గర కల్వర్టు నిర్మాణం జాప్యం చేయడం వల్ల చుట్టూ రాళ్లు, మట్టి గడ్డలు ,కూలగొట్టిన కాంక్రీట్ గడ్డలు, ఉండి నీరు పోలేక .శాఖరాసికుంట ఎస్సీ కాలనీ చిన్న వర్షానికి ఇళ్లలోకి నీరు రావడం చాలా దారుణమైన పరిస్థితి పందులతో ,పాములతో స్వైర విహారం చేస్తూ మురుకు నీళ్లలో మగ్గుతున్న జనాలకు బాసటగా కానరాని నాయకులు కార్పోరేటర్ ,కూతవేటు దూరంలో ఉన్న ఎమ్మెల్యే.పట్టించుకునే దిక్కులేదు.ఈరోజు వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో మున్సిపాలిటీ సూపర్వైజర్ మాదాసు సాంబయ్య గారి ఆధ్వర్యంలో 33,39 డివిజన్ లలో పని చేసే సఫాయి కార్మికులను పిలిపించి కల్వర్టు దగ్గర ఉన్న మట్టిగడలను, రాళ్ళను, కల్వర్టు కోసం నిర్మాణం కోసం ఉంచిన దుంగలను తీపించడం జరిగింది ఈ కార్యక్రమంలో 39 వ డివిజన్ జమాన్ .రాజు,33 డివిజన్ జమాన్ రాధిక, మరియు స్థానిక వాసులు, పట్ల సాగర్, చింతా కుమార్, ప్రదీప్ పాల్గొన్నారు




