Thursday, 5 November 2026

చిన్నపిల్లలను పనులు పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు

ఎస్సై ఆర్ శేఖర్
మల్దకల్ జూలై  (జనంసాక్షి) మండల పరిధిలోని ఎల్కూరు గ్రామంలో ఆదివారం మల్దకల్ పోలీసు ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్ గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో బాల్య వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి వారు తల్లిదండ్రులు,అమ్మాయి తరపు తల్లిదండ్రులు వివాహం కుదిరిచినటువంటి పెద్ద మనుషులు అందరి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి భాస్కర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.