చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిది
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15, ( జనం సాక్షి ) : అమ్మ నాన్న చనిపోయిన చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని ఉబ్బని రాజు అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామంలో రోడ్డ బాబు అనారోగ్యంతో మృతిచెందగా,ఆతని బార్య సత్య లక్ష్మి అనారోగ్యంతో రెండు నెలల క్రి తం చనిపోవడం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పాప (15) బాబు (6)ఉన్నారు.అమ్మ నాన్న చని పోయిన ఈ పిల్లలు చాలా చిన్నవాళ్లు వీరికి ఏదై నా సాయం చేయాలని మానవతా దృక్పథంతో ఉబ్బని రాజు, ఎద్దు కిరణ్,ఉబ్బని అజయ్ ముగ్గు రూ కలిసి గ్రామంలో తిరిగి గ్రామప్రజల నుండి 42, 220 రూపాయల విరాళాలు సేకరించడం జరిగిం ది. గ్రామస్థులు ఇచ్చిన విరాళాలను చిన్నారులకు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుల పెద్దమ నిషి బలిజ రాజు, గునిగంటి మల్లయ్య, మగ్గం కృష్ణంరాజు,భిక్షపతి,మన్యాల మహేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.ఈచిన్నారులకు విరాళా లిచ్చిన ప్రతి ఒక్క రికీ ఉబ్బని రాజు, ఎద్దు కిరణ్, ఉబ్బని అజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.