Wednesday, 4 November 2026

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత ఆసరా

హత (జనం సాక్షి)
సీఎం సహాయ నిధులు పేద కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తున్నాయని తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడు దండు ప్రవీణ్ రావు అన్నారు.మండలం పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెపల్లి గ్రామానికి చెందిన దేవులపల్లి వీరస్వామికి రూ.2లక్షల25వేల విలువగల చెక్కును ఎమ్మెల్యే మధన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం లబ్దిదారుడికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో  ఉప సర్పంచి సురేష్ గౌడ్,శేఖర్ రావు,మురళిధర్ గౌడ్, మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area