Tuesday, 3 November 2026

చిరును సన్మానించనున్న సిని ఇండస్ట్రీ.?

హైదరాబాద్‌: చిరంజీవి పర్యాటక శాక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవిపై సినీ ఇండస్ట్రీలో ఆయన వైరి వర్గం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్‌ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు  సమాచారం. ఐతే సినిమాల్లో ఉన్నప్పుడు అందరివాడుగా ఉన్న చిరంజీవి, రాజకీయ నేతగా కొందరివాడుగా  మారిపోయాడని సినీ వర్గాల్లో ఉన్న టాక్‌. దీనిని చెరిపేస్తూ ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు, దర్శకులు, నటులు కలిసి భారీస్థాయిలో చిరంజీవిని సన్మానించాలని సిని వర్గాలు రైట్‌ మ్యాప్‌ వేసుకున్నట్లు సమాచారం. చిరుకు దక్కిన పర్యాటకశాఖ  పదవితో దేశంలోనే కాక విదేశాల్లో  సైతం సినిమాలకు మరిన్ని రాయితీలు వచ్చే విధంగా యత్నించాలని వారు అనుకుంటేన్నట్లు సమాచారం. చిరు స్పందన ఎల ఉందో తెలియదుగాని ఇండస్ట్రీ స్టార్‌ ప్రోడ్యూసర్లు ఇప్పటికే వేడుకకు సంబందించిన రోడుమ్యాప్‌ సిద్దం చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *