చిరు వ్యాపారికి గొడుగు అందజేత

చిరు వ్యాపారికి గొడుగు అందజేత

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని పెంచికల్ పేట్ వద్ద కంకులు విక్రయించే, సాగర్ల లత కి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో వర్షాకాలం దృష్ట్యా చేయించిన గొడుగు పంపివ్వగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు లత కి గొడుగు ( చేత్రి ) ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెంచికల్ పేట్ సర్పంచ్ కొండ వెంకటేష్, పెద్దంపేట్ ఎంపీటీసీ కామ శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు బైరీ అంజయ్య, కాట హృదయ కుమార్, సాగర్ల లక్ష్మణ్, కామ శ్రీను, ఇరుగురాల నారాయణ, భూతపల్లి కిట్టు, కమ్మటి సాయి, ఆకానపల్లి సుధాకర్ గౌడ్, కుమ్మరి రమేష్, కొత్తపల్లి మోగిలి, రాచకొండ రమేష్, ఎంబడి శ్రీకాంత్, పిడుగు కబీర్, చింతల సందీప్, చీటి మారుతీ తదితరులు పాల్గొన్నారు.