పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం

పేద వర్గాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం

జనంసాక్షి , కమాన్ పూర్ : పేద వర్గాలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తుందని పెంచికల్ పేట్ సర్పంచ్ కొండ వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన అనవేన హనుమంత్ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహయ నిధికి సిఫార్సు చేసుకోగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అనవేన హనుమంత్ కు 24.000 /- రూ మంజూరు కాగా ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బైరీ అంజయ్య, కాట హృదయ కుమార్, సాగర్ల లక్ష్మణ్, కామ శ్రీను, ఇరుగురాల నారాయణ, భూతపల్లి కిట్టు, కమ్మటి సాయి, ఆకానపల్లి సుధాకర్ గౌడ్, కుమ్మరి రమేష్, కొత్తపల్లి మోగిలి, రాచకొండ రమేష్, ఎంబడి శ్రీకాంత్, పిడుగు కబీర్, చింతల సందీప్, చీటి మారుతీ తదితరులు పాల్గొన్నారు.