Saturday, 7 November 2026

చెకుముకి సైన్సు టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత

చెకుముకి సైన్సు టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత

ఆత్మకూర్(ఎం) నవంబర్ 28 (జనంసాక్షి) జన విజ్ఞాన ఆధ్వర్యంలో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూరెళ్ల విద్యార్థులు ఎన్ అమూల్య యం రోహిత టి సోను తెలుగు మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొరటికల్ విద్యార్థులు బి దుర్గా ప్రసాద్ పి యోగేంద్ర సిహెచ్ భాస్కర్ లు ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులుగా జ్ఞాపికలను అందజేయడం జరిగింది ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది దర్శనం వెంకన్న జూకంటి కరుణాకర్ లు మాట్లాడుతూ మూఢనమ్మకాలను నిర్మూలించడంలో జన విజ్ఞాన వేదిక నిర్విరామంగా కృషి చేస్తుందని చేతబడి వంటి వాటిని నమ్మకూడదని అన్నారు రేపు జరగబోయే జిల్లా స్థాయి పరీక్షల కూడా మంచి ప్రతిభను కనబరిచి మండలానికి మంచి పేరు తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి సతీష్ ఆంజనేయులు జెట్ట రవీందర్ స్వరూప రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు