Thursday, 5 November 2026

చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేసిన ప్రముఖులు

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): రైతుబందు కింద అందిన చెక్కులను పలువురు ప్రముఖులు, రైతులు,ఇతరులు వదులుకున్నారు. వీరంతా తమకు అదింన మొత్తాన్‌ఇన తిరిగి ప్రభుత్వానికే అందచేశారు. అవన్నీ రైతు సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌లుముందున్నారు. అలాగే  భద్రాచలం రైతు తాళ్లూరి పంచాక్షరయ్య రూ.52,000 చెక్కును తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని ఆరెంపుల గ్రామంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు తన 11 ఎకరాలకు సంబంధించిన రూ.46,500 విలువైన చెక్కును రైతు సంక్షేమ నిధి కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో బాలికల పాఠశాల హెచ్‌ఎం గడిపూడి ఝాన్సీ రూ.16వేల చెక్కును, ఆమె కుమారుడు చరణ్‌ చంద్ర రూ.6వేల చెక్కును, ఖమ్మం ఏడీఏ మణిమాల రూ.4వేల చెక్కును రైతుసంక్షేమనిధికి అందజేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కమలాపూర్‌ రైతు అజ్మీరా ఊజానాయక్‌ రూ.8వేల చెక్కును అధికారులకు అప్పగించారు. జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేటకు చెందిన జలవనరుల సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకా?షరావు రూ.36,700 చెక్కును వదులుకున్నారు.