14న యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
ఏలూరు,మే11(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఎఫ్ రుణాలను చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 14న జిల్లా ఖజానా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపిమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గత నాలుగు నెలలుగా పీఎఫ్ రుణాలు చెల్లించడంలేదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి చివరిగా చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తం, గ్రాట్యుటీ, పింఛన్లను ప్రభుత్వం చెల్లించని కారణంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా ఖజానా కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.