Wednesday, 4 November 2026

*చెక్కులను పంపిణీ చేసిన మంత్రి*

కాప్రా  ( జనం సాక్షి ) జూలై 22 :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పథకం పేద కుటుంబాలకు ఎంతగానో వినియోగ పడుతుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఆర్ఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ మేయర్ కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తాలతో కలిసి వినియోగదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Attachments area