సికింద్రాబాద్ (జనం సాక్షి ) చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆదివారం జరగబోయే బోనాల జాతర పండుగ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోదేశి నరేష్ ఫలహారం బండి ఊరేగింపు చేసే భక్తుల తో సమావేశం నిర్వహించారు . సీఐ నరేష్ మాట్లాడుతూ పలహారం బండి ఊరేగింపులో ఎటువంటి గొడవలు జరగకుండా సామరస్య పూర్వకంగా అందరూ కలిసిమెలిసి బోనాల పండుగ నిర్వహించుకోవాలని నాయకులకు , భక్తులకు ప్రజలకు సూచించారు. బోనాల జాతర సందర్భంగా డీ జె లు ఏలాంటి అనుమతులు లేవు. ఎవరైనా డీజే లు పెడితే కేసు నమోదు చేసి డీజే లను సీజ్ చేస్తామని తెలిపారు. ఫలహార బండి వీలైనంత త్వరగా సాయంత్రం నుండే ఊరేగింపు మొదలుపెట్టి త్వరగా ముగించాలని అన్నారు. బోనాల జాతర అందరు ప్రశాంతంగా జరుపుకోవాలని ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కార్పొరేటర్ హేమ పాల్గొన్న రు .
బోనాల జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలి.. సీఐ గోదేశి నరేష్ సూచన… డీజే లకు అనుమతి లేదు..




