అల్వాల్ (జనంసాక్షి) జూలై 22
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ రాజీవ్ నగర్ కాలనీలో వర్షపు నీటిని కాలనీలలో నిలవకుండా జిహెచ్ఎంసి ఎమర్జెన్సీ టీం తో నాలాలను శుభ్రం చేపిస్తున్న కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏ కాలనీలో వర్షాలు నిలుస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్షణమే ఎమర్జెన్సీ టీములు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ కార్తీక్,ఏఈ అరుణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




