పలుచోట్ల ఉద్రిక్తతలు..నగదు కొరత
హైదరాబాద్,మే14(జనం సాక్షి): రైతుబంధు పథకం చెక్కుల మార్పిడి కోసం రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరడంతో అనేక ప్రాంతాల్లో నగదు కొరత ఒక్కసారితగా వచ్చిపడుతోంది. ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినా నగదు సమస్య తప్పడం లేదు. దీనికితోడు రైతులు కూడా గుంపుగా ఒకేసారి బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. రెండు రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు చేరుకుంటున్నారు. దీంతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుకు పంట సాయం కోసం చెక్కులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ చెక్కులను నగదు రూపంలో మార్చుకునేందుకు రైతులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఇదిలావుంటే రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి హరీస్ రావు కోరారు. ఈ మేరకు ఆయన జహారీబాద్ ఎస్బిఐకి వెళ్లి చెక్కులను మారుస్తున్న తీరును గమనించారు. త్వరగా వారికి నగదు అందేలా చూడాలన్నారు. ఇకపోతే అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోటల్ పోలీసులు దగ్గరుండి రైతులను కంట్రోల్ చేస్తున్నారు.
————–




