Wednesday, 4 November 2026

చెట్టును ఢీకొన్న టాటాసుమో:ఐదుగురు మృతి

చిత్తూరు:మామండూరు దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఓ సుమో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సుమోలోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కడప జిల్లా చిట్వేల్‌ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *