చెట్టు కింద గణపతి వద్ద మహా అన్నదానం

ముప్కాల్ : మండల కేంద్రంలోని చెట్టు కింద గణపతి వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెట్టు కింద ఉందే పెద్ద మనుషులంతా కలిసి ఐక్యతతో ఈ గణేష్ విగ్రహన్ని గత మూడు సంవత్సరాలుగా చెట్టు కిందనే నిలుపుతున్నారు. చిన్న పెద్ద,పేద ధనిక తేడా లేకుండా అంతా సమిష్టి కృషి తో ఈ మహా అన్నదానం లో భారీ ఎత్తున గ్రామ ప్రజలు తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.విగ్రహాన్ని గైని మని కొని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో సంఘ అధ్యక్షుడు కంచు గంగాధర్ , సెక్రటరీ ఛిన్న రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, మని, గోపి రమేష్, గైని రమేష్, కల్లు సామి తదితరులు పాల్గొన్నారు.