Wednesday, 4 November 2026

చెత్తలో బ్యాలెట్‌ పత్రాలు లభ్యం

సూర్యాపేట,జనవరి22(జ‌నంసాక్షి): మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి బ్యాలెట్‌ పత్రాలు మంగళవారం ఉదయం పాఠశాలలో లభ్యమయ్యాయి. సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. రాత్రి ఆలస్యంగా లెక్కింపు పూర్తయ్యింది. మంగళవారం ఉదయం పాఠశాల స్వీపర్‌ గదిని శుభ్రం చేసి అందులో లభ్యమైన కాగితాలను బయట వేసింది. బయటవేసిన ఆ కాగితాల్లో బ్యాలెట్‌ పత్రాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. తెరాస బలపరిచిన అభ్యర్థికి చెందిన వ్యక్తులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 60 వరకు బ్యాలెట్‌ పత్రాలు ఉన్నట్లు వారు గుర్తించారు. వాటిని తీసుకుని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ వద్దకు వెళ్లారు. బ్యాలెట్‌ పత్రాలు బయటపడటంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.