చెన్నూరులో అమ్మవారికి బోనం సమర్పించిన బాల్క సుమన్ .

చెన్నూరు నియోజకవర్గం, చెన్నూర్ పట్టణంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా చెన్నూర్ కొత్త బస్టాండ్ నుండి మదన పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.