Thursday, 5 November 2026

చెస్ట్‌ తరలింపులో రాజ్యాంగ విరద్ద చర్యలేవీ లేవు

నాగం పిటిషన్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు
హైదారబాద్‌,ఫిబ్రవరి16  జ‌నంసాక్షి : చెస్ట్‌ ఆస్పత్రిని తరలింపుపై బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. చెస్ట్‌ ఆస్పత్రిలో తెలంగాణ ప్రభుత్వం అనంతగిరి కొండల్లోకి తరలించాలన్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ నాగం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చెస్ట్‌ ఆస్పత్రి ప్రజలకు దూరంగా ఉండడం మంచిదే అని కోర్టు తెలిపింది. అంతేగాకుండా ఇందులో రాజ్యంగా విరుద్ధ నిర్ణయాలు ఏవీ లేవని కూడా కోర్టు అభిప్రాయపడింది. నగరం మధ్యలో ఉన్న ఆస్పత్రిని తరలించడం ద్వారా రోగులకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందని నాగం తరపు న్యాయవాది తెలిపారు. 1956లో ఈ ఆస్పత్రిని నిర్మించినప్పుడు 10 లక్షల జనాభా మాత్రేమే ఉండగా, ప్రస్తుతం కోటి జనాభా వరకు చేరిందన్నారు. ఆస్పత్రిని తరలించడం ద్వారా తెలంగాణ జిల్లాలతో పాటు, దేశవ్యాప్తంగా చికిత్స కోసం వచ్చే వారు ఇబ్బందులకు గురవుతారని నాగం తరపు న్యాయవాది కోర్టు వాదించారు.దీనిపై స్పందించిన హైకోర్టు అంటువ్యాధులున్న ఆస్పత్రిని తరలించడం వల్ల కలిగే నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఆస్పత్రిని తరలించడంతో అక్కడి వాతావరణంతో రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆస్పత్రి తరలింపుపై సలహాలు, చనలను ప్రభుత్వానికి ఇవ్వవచ్చని ఈ పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ రెండింటి తరలింపును వ్యతిరేకిస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పలువురు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తరలింపు చట్ట వ్యతిరేకం కానప్పుడు

ఏమి చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. సహేతుకు కారణాలు లేనప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఛాతి ఆస్పత్రి నగరానికి దూరంగా ఉండటమే మేలు అని కూడా కోర్టు పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలతో ప్రతిపక్షాల నేతల నోర్లకు మూతలు పడ్డాయి. ఎర్రగడ్డలో ఉన్న ఛాతి ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఛాతి ఆస్పత్రిలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు సర్కార్‌కు ముఖ్యంగా కెసిఆర్‌ తసీఉకున్న నిర్ణయానికి బలం పెరిగింది. ఇక ఆస్పత్రి తరలింపు, సచివాలయ నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *