Thursday, 5 November 2026

ఆధునిక యుద్దఫిరంగి కెసిఆర్‌

సంచలన నిర్ణయాలకు మారుపేరు కెసిఆర్‌

నేడు కెసిఆర్‌ జన్మదినం

హైదారబాద్‌,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): ఆధునిక యుద్ద ఫిరంగి అంటే ఏమిటో పేల్చి చూపిన వ్యక్తి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. ఉఫ్‌న ఊదితే కొట్టుకుపోతారన్న వారంతా ఆయన ఉద్యమం ముందు కనుమరుగయ్యారు. చరిత్రలో ఎన్నో విప్లవ పోరాటాలకు దీటుగా సరికొత్త భాష్యం చెప్పి ప్రత్యేక తెలంగాణను సాకారాం చేసిన ఆధునిక విప్లవ వీరుడు కెసిఆర్‌ అనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి 17 ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.. 14 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటంలో అవమానాలు ఎదురైనా వేసిన అడుగు ముందుకే పడ్డది తప్ప వెనక్కి తిరిగి చూడలేదు. కేసీఆర్‌  1954 ఫిబ్రవరి 17న మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం చింతమడ్క గ్రామంలో జన్మించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ సాధించి నాలుగున్నర కోట్ల ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. తెలంగాణ కోసం ఎంతటి పట్టుదలతో పనిచేశారో ఇప్పుడు సిఎంగా కూడా కెసిఆర్‌ అంతే పట్టుదలతో పనిచేస్తున్నారు. అసాధ్యమన్న తెలంగాణ ఏర్పాటును సుసాధ్యం చేయడంలో ఆధునిక యుద్దరీతులను అవలంబించిన విప్లవసారథిగా చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో ఆచరణ సాధ్యం కాదనుకున్న పనులన్నీ భుజాన వేసుకుని వాటిని పట్టాలకు ఎక్కించిన ధీరుడిగా సాగుతున్నారు. మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన, సచివాలయ తరలింపు తదితర భారీ పనులను చేపట్టారు. మిగులు విద్యుత్‌ లక్ష్యంగా పనులు చేపట్టారు. ఆటంకాలు, అవమానాలు, కుట్రలు, కుతంత్రాలకు ఎదురొడ్డి సకల జనులతో సమరం చేయించిన తరహాలనో ఇప్పుడు చేసే పనులపై విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగతున్నారు. బ్రాండ్‌ తెలంగాణ ఇప్పుడు కెసిఆర్‌ లక్ష్యం. గమ్యాన్ని ముద్దాడుతానని చెప్పి, కలలు గన్న తెలంగాణ రాష్టాన్న్రి కళ్లెదుట నిలిపింది మొదలు, ఎన్నికల్లో విజయంసాధించాక కూడా అలుపెరుగని రీతిలో  ముందుకు సాగుతున్న జననాయకుడు కెసిఆర్‌. ఆయనకు తలబిరుసని లేదా అహంకారమని, లేదా కుటుంబం కోసం బంగారు తెలంగాన అని అంటున్న వాళ్ల విమర్శలు లెక్కచేయకుండా నిర్దేశించుకున్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పనులుచేయకుంటే ఓట్లు అడగను… అని గట్టిగా చెప్పిన ఆధునిక రాజకీయ మేధావి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పట్టుదలతో మొండి ధైర్యంతో ముందుకెళ్లి ఆరు దశాబ్దాల పోరాటాన్ని గమ్యాన్ని చేర్చిన ఘనత కెసిఆర్‌ది. తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని పెదవి విరిచిన వారే ముక్కున వేలేసుకునేలా చేశారు. ఎంఏ తెలుగు పూర్తిచేసిన కేసీఆర్‌ 1970 యూత్‌ కాంగ్రెస్‌తో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1983లో టీడీపీలో చేరి సిద్దిపేట నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నడూ ఓటమిని చవిచూడలేదు. 89, 94, 99 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్న కేసీఆర్‌ 1987-88లో, 1996లో మంత్రిగా పని చేశారు. 1999లో విజయం సాధించి డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పూర్తిగా బోరుబావులపై ఆధారపడిన రైతాంగంపై విద్యుత్‌ చార్జీల భారం మోపిన అప్పటి టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిప్యూటీ స్పీకర్‌ పదవి, శాసనసభ్యత్వం, తెలుగుదేశం పార్టీకి 2001 ఏప్రిల్‌ 27న రాజీనామా చేశారు. అదే రోజున హైదరాబాద్‌ జలవిహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పార్టీని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశీర్వాదంతో ముందుకు కదిలారు. యుద్దంలో ఎవరెవరిని ఎలా ముందుకు తసీఉకుని పోవాలో ఎప్పికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర వహించారు. అనంతరం కేంద్రం మాట తప్పడమే కాకుండా అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై కుట్రలకు తెరలేపారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఇవాళ గోల చేస్తున్నవారెవరూ ఆనాటి ఘటనలను

విమర్శలేదు. వైఎస్‌ను ఎదరించలేదు. కాంగ్రెస్‌ నేతల మెడలు వంచి, బిజెపిని ఒప్పించి విజయం సాధించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో కెసిఆర్‌ పేజీలు చరిస్తాయిగా ఉంటాయనడంలో సందేహం లేదు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో అని ప్రకటించి 2009 నవంబర్‌ 29న నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఉద్యోగ సంఘాలు, జయశంకర్‌సార్‌ వంటి ప్రముఖులు వారించినా మొండి పట్టుదలతో దీక్షను కొనసాగించారు. ఇది ఉద్యమంలో కీలకమలుపుగా భావించాలి. రష్యా, చైనా, క్యూబా దేశాల విప్లవాల్లో విజయం సాధించిన వారే పాలకులయ్యారు. వారే తమదేవాలను ఆదర్వంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కెసిఆర్‌ అదే పనిలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడి కేవలం 9 నెలల కాలమే అయ్యింది. దీని ఫలాలు అందుకోవడానికి ఓపిక కావాలి. కుక్కలుచింపిన విస్తరిలా ఉన్న తెలంగాణను అతుకుల బొంత నుంచి మంచి దుప్పటిగా మార్చుకోవాల్సి ఉంది. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధనకు  కేసీఆర్‌ తెలంగాణ రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. కాంగ్రెస్‌, టీడీపీలు వెనుకడుగు వేసినా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఆయనకు అడుగడుగనా శాపనార్థాలే. తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలే ఉన్నాయి. పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్టాన్న్రి తెచ్చిన ఘననేత కేసీఆర్‌ ఇప్పుడూ అదే ఊపులో పునర్నిర్మాణ లక్ష్యంతో బంగారు తెలంగాణ సాధనలో నిమగ్నం అయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ మంచివేనని తెలంగాణ ప్రజలే కితాబును ఇస్తున్నారు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో ప్రజలు ఓపిక పడితే ఓ నాలుగేళ్ల తరవాత మధుర ఫలాలు అందుకునే వీలుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *