Wednesday, 4 November 2026

చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు ప్రశంసలు

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 25. (జనంసాక్షి). చేనేతలో అనేక ప్రయోగాలను చేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల చేనేత కళాకారుడు వేల్ది హరిప్రసాద్ చేనేత కళ ను చూసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ బుయాన్ సతీమణి ,కూతురు ప్రశంసించారు. శనివారం వేములవాడ వెళ్తూ సిరిసిల్లలో ఆగారు. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో అమీరే చీరతో పాటు. మగ్గం పై నేసిన ఉత్పత్తులను పరిశీలించారు. జాతీయ స్ఫూర్తిని నింపేలా మగ్గంపై నేసిన కళారూపాన్ని ఆసక్తిగా తిలకించారు. చేతిమగ్గంపై అద్భుతాలను ఆవిష్కరించిన హరిప్రసాదను ప్రశంసించారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్టార్ కే సుజనా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యన్. ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.