చేనేత సహకార సంఘాలఎన్నికలకు 4న నామినేషన్లు

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలోని 65 చేనేత సహకార సంఘాలకు జరగనున్న ఎన్నికలు ఈ నెల 4వ తేదీన నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలు ఆయా మండలాల్లో ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. మొత్తం 84 సంఘాలున్నప్పటికీ ప్రస్తుతం 41కాటన్‌, 17 సిల్క్‌, 6 మరమగ్గాల, ఒక ఉన్ని సంఘానికి పదవీ కాలం పూర్తి కావడంతో వీటికి ఈ నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ సంఘాల్లో మొత్తం 12వేలమంది సభ్యులు ఓటు హక్కును వినియోగంచుకోనున్నారు.