Tuesday, 3 November 2026

చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి చేపమందు పంపిణీకి సంబంధించి వివరాలు మీడియాకు వివరించారు.1200 మందితో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రేపు, ఎల్లుండి నాంపల్లి ఎగ్జిబిషన్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సూచించిన ప్రాంతంలో పార్కింగ్‌ చేయాలని డీసీపీ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *