చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీ పై యువతకు వృత్తి నైపుణ్యత శిక్షణ
గరిడేపల్లి, ఆగస్టు 8 (జనం సాక్షి): మాంసాహారంతో పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంసకృత్తు మంచి పౌష్టికహారం కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా మార్పు చేసి విక్రహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందడం తో పాటు చేపల వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు నని కేవీకే గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త ఎన్. సుగంధి, శాస్త్రవేత్త డా. టి. మాధురి లు తెలియచేశారు. సోమవారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతకు జాతీయ మస్థ్య అభివృద్ధి మండలి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సెంటర్ ఫర్ ఇన్నో్వేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ వారి ఆర్ధిక సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా చేప ఉత్పత్తుల తయారీ వినియోగంపై యువతి యువకులకు కేవీకే శాస్త్రవేత్తలు యువతకు తయారీ విధానాలపై ప్రాక్టికల్ గా శిక్షణ ఇచ్చినట్లు తెలియజేసారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రములో చేపల సాగు బాగా పెరిగి అందరికి అందుబాటులో ఉండి తినడానికి ఇష్ట పడిన వాటి ముళ్లంటే భయపడే వారు కొందరున్నారు కాబట్టి చేపలను ఎన్నో విలువైన ఉత్పత్తులుగా తయారు చేసి అమ్ముకోవడం ద్వారా స్వయం ఉపాధిని పొందవచ్చునని అన్నారు. ఇతర మాంసాహారాల వలె చేపల ద్వారా విలువైన ఉత్పత్తులయినటువంటి చేప ముక్కలు చేప పిల్లేట్స్ చేప కైమా చేప వడియాలు మురుకులు చేప బాల్స్ కట్లెట్స్ వేపుడు పచ్చళ్ళు బజ్జీలు మొదలగునవి స్థానిక అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చునని వీటిని తినడానికి బాగా ఇష్టపడుతారని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా యువతీ యువకులు చేప మాంసంతో తయారు చేసే వివిధ రకాల వంటకాలను తెలుసుకొని ప్రాక్టికల్ గా చేపల విలువదారిత వంటకాలను వండి నైపుణ్యం పొందారని సీనియర్ శాస్త్రవేత్త కోర్స్ కోఆర్డినేటర్ బి. లవకుమార్ తెలియచేశారు. ఇలా తయారు చేసుకొన్నచేప ఉత్పత్తులు నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చునని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి.నరేశ్, నరేశ్, ఏ.కిరణ్, డి. ఆదర్శ్ పొందుతున్న యువత రాణి, త్రివేణి, ప్రణీత, రోహిణి, సరస్వతి, ప్రియాంక, నవ్య, కుర్రి వెంకన్న,సురేందర్, నాగరాజు నరేష్, రమేష్, వంశీ, మనోజ్, సైదులు, విజయకుమార్ సందీప్, కిరణ్ లతో 30 మంది పాల్గొన్నారు.