చేప పిల్లలతో మాస్త్యకారులకు చేయూత . ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.

 రాష్ట్ర ప్రభుత్వం మాస్త్యకారులకు చేయూతను అందిస్తుందని ఎంపిపి బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టులో మస్తశాఖ ఆధ్వర్యంలో  2లక్షల 50వేల చేపపిల్లను సంఘ నాయకులతో కలిసి ప్రాజెక్టులో వదిలారు.ఈ సందర్భంగా
ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న చేపపిల్లన్లు సద్వినియోగం చేసుకోవాలని, వారి జీవన ఉపాధికి సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. మండలంలోని ముదిరాజులు అందరూ ఉపాధిని పొందాలని సూచించారు.107 చెరువులలో 11లక్షల  చేపపిల్లలను  ఎంపిపి  వదిలారు. ఈ కార్యక్రమంలో యాలాల  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలుకుందే హనుమంతు, జిల్లా కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా, మండల ముదిరాజ్  సంఘం ఉపాధ్యక్షులు అశోక్, నాయకులు ఆకుల బస్వరాజ్, రవితదితరులు పాల్గొన్నారు.
Attachments area