Thursday, 5 November 2026

తక్కెళ్లపల్లి రాము కుటుంబ సభ్యులను పరామర్శించిన వినోద్ కుమార్

సెప్టెంబర్ 19( జనం సాక్షి)  హైదరాబాద్

తెలంగాణ జన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రాము మృతి చెందిన నేపథ్యంలో సోమవారం వరంగల్ లోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు.

దివంగత రాము తండ్రి అయిన మాజీ మంత్రి తక్కేళ్లపల్లి పురుషోత్తం రావు గారిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వినోద్ కుమార్ ధైర్యం చెప్పారు. గుండె నిబ్బరంతో ఉండాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను వినోద్ కుమార్ సూచించారు.