చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 : మాజీ టీపీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వకలాభరణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలో పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో జనగామ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కార్యకర్తల సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేర్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు, మున్సిపల్ కౌన్సిలర్లు చెవిటి లింగం, సందుల సురేష్, ముస్త్యాల తార-యాదగిరి, పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము రవి, ఆకునూరు ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు కూరపాటి మధుసూదన్, కాటం శ్రీనివాస్, వెలుగల దుర్గయ్య, బుడిగె రమేష్, సుతారి రమేష్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేర్యాలలో ఘనంగా పొన్నాల జన్మదిన వేడుకలు.




