చేర్యాల మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు

, జులై 11 (జనంసాక్షి) : మండల కేంద్రతో పాటు ఆయా గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఎడతెరపి లేని వర్షం కురియడంతో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలను మసీదుల్లోనే నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మసీదుల వద్ద ముస్లిం సోదరులకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు