చేర్యాల రెవెన్యూ డివిజన్ కోరుతూ ఎమ్మెల్సీ పోచంపల్లికి వినతి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మండల వాసులు పొన్నం వెంకటేష్ గౌడ్, చంద శ్రీకాంత్, కూరపాటి నర్సింహులు పాల్గొన్నారు.