చేవెళ్ల మండల సోషల్ మీడియా ఇన్చార్జిగా కె.మాణిక్యం నియామకం…

చేవెళ్ల జులై   (జనంసాక్షి)
చేవెళ్ల మండల సోషల్ మీడియా ఇన్చార్జిగా తలరం గ్రామానికి చెందిన ఖానాపురం మాణిక్యమును నియమించినట్లు చేవెళ్ల మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజక వర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి లు తెలిపారు.ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. చేవెళ్ల మండల సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించినందుకు చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు వసంతం, చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలంపల్లి వీరేందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్ ,డిసిసి ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొజ్జంకి  సత్యనారాయణ,ఊరెళ్ళ దేవేందర్,హనీఫ్,పల్గుట్ట శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area