సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం అందజేత

ఖానాపురం జూలై   జనం సాక్షి
మండలంలోని బుధ రావు పేట గ్రామానికి చెందిన గీత ఐస్ కూల్ డ్రింక్ షాప్ యజమాని మల్యాల మధుకర్ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు తన వంతు సాయంగా పదివేల రూపాయలను సర్పంచ్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో స్థానిక ఎస్ఐ పిట్టల తిరుపతికి విరాళంగా అందజేశారు. ఈసందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. గ్రామంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు ముందుకొచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తద్వారా గ్రామంలో జరిగే నేరాలను నియంత్రించవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు.