హైదరాబాద్,జూలై31(జనం సాక్షి ): హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి పసుమాముల గ్రామం నారాయణ కళాశాల సవిూపంలో దుండగులు చైన్‌స్నాచింగ్‌కు యత్నించారు. ప్లాస్టిక్ కంపెనీలోనికి పనికి వెళుతున్న తారామతిపేట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి(40) మెడలోంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు పుస్తెల తాడు లాగేందుకు యత్నించారు. తోటి మహిళలు అడ్డుకుని దుండగులపై దాడి చేయడంతో ఆగంతకులు తప్పించుకుని పరారయ్యారు. లక్ష్మికి గాయాలు కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.




