హైదరాబాద్,జూలై31(జనం సాక్షి ): మహిలలకు ఉద్యోగావకశాలు కల్పించే నర్సింగ్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ కార్పోరేషన్ ముందుకు వచ్చింది. ఈ పథకం కింద శిక్షణ కల్పించి ఉద్యోవకాశాలు వచ్చేలా చేస్తారు. ఎస్‌సి కార్పొరేషన్, అపోలో మెడ్‌స్కిల్స్ ఆధ్వర్యంలో మహిళలకు నర్సింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్‌సి కార్పొరేషన్ ఇడి హన్మంత్‌నాయక్ తెలిపారు. రీఫ్రెషర్ ట్రైనింగ్ ఫర్ ఏఎన్‌ఎం, టిఐఎఆర్‌ఎ బ్రిడ్జి ట్రైనింగ్ ప్రొగ్రాం ఫర్ న్యూ నర్సెస్ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. 18-35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తుతో పాటు కులం, ఆదాయ, ఆధార్ కార్డులను జతపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




