జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం గ్రామంలో నల్ల నరసింహ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ సోమవారం పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఇటీవల అనారోగ్యంతో మరణించిన తోటపల్లి శివయ్య లకు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు . అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నాగెల్లి శాంతమ్మని కొత్త శైలజ పరామర్శించారు. ఆమె వెంట టిఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.




