Tuesday, 3 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంఘటన చోటుచేసుకుంది. గత రాత్రి బీజాపూర్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్‌నార్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా సంఘటనా స్థలంలో వరద నీటితో నిండిపోయి ఉందని, పోలీసుల కూంబింగ్‌కు ఇబ్బంది కలుగుతుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *