Tuesday, 3 November 2026

నిమ్స్‌లో మొక్కలు నాటిన కేసీఆర్‌

cm-nims2హైదరాబాద్‌: హరితహారంలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రముఖులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు హరితహారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

బీహెచ్‌ఈఎల్‌లో హరితహారంలో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు.

కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించిన హరితహారంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సినీతారలు రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, రాజ్‌తరుణ్‌, రెజీనా తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.

అల్లు అర్జున్‌, దగ్గుబాటి రానా తమ నివాసాల్లో మొక్కలు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *