-రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి
-మండల తాహశీల్దారు,శ్రీనివాస్ రావు
మిరుదొడ్డి,అక్టోబర్ 17,(జనంసాక్షి)
మిరుదోడ్డి మండల పరిదిలోని జంగపల్లి గ్రామంలో మంగళవారం రోజున భూ రికార్డుల పక్షాళన కార్యక్రమం ప్రారంభం అయిందని మండల తాహశీల్దారు శ్రీనివాస్ రావు తేలిపారు. ఈ సదస్సులో ఏమైన భూరికార్డుల సమస్యలుంటే పరిష్కరించుకోవాలని గ్రామస్థును కోరారు. భూ శుద్దీకరణ సదస్సులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పౌతి విరాసత్ అనగా భర్త చనిపోతే బార్యపైన పట్టా మార్పు చేసుకోవచ్చు అన్నారు. ఎవైన ఇంటి పేరు తప్పుబడిన సవరణ చేసుకోవాలన్నారు. డబుల్ ఖాత నంబరు గల పట్టెదారులను ఇప్పుడు ఒకే ఖాతలోకి చేర్చబడుతుందన్నారు. ఈ సదస్సులో పైసా ఖర్చు లేకుండా భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. గతంలో రైతులు భూ సమస్యల కోసం మండల కార్యలయాల చుట్టూ తిరిగేవారన్నారు. ఇప్పుడూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు పడకుండా గ్రామాలకు వేళ్ళీ భూ సమస్యలు పరిష్కరించాలని ఈ సదస్సులు పెట్టడం జరిగిందన్నారు.రైతు రాజులాగ బ్రతకడమే మన ముఖ్యమంత్రిగారి లక్ష్యం అన్నారు. ఈ రికార్డుల ఆధారంగానే మార్చి నెలలో సంవత్సరమునకు ఏకరానికి ఎనిమిది వేల రూపాయాల పెట్టుబడిని నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు.కాబట్టి రైతులందరుా ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మిప్రతాప్ రెడ్డి, విఆర్ వోలు.నర్సింలు,శివరాజం,రెవెన్యూ సిబ్బంది.రాజు,ఉ.సర్పంచ్ పోలబోయిన చంద్రాగౌడ్ ,అత్మకమిటి డైరెక్టర్ కంచం రాజులు,రైతు సమన్వయ కమిటి కన్వినర్ బి.సిద్దారెడ్డి,నర్సింహరెడ్డి, అంజయ్య,భూపతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.
జంగపల్లి గ్రామంలో భూ రికార్డుల ప్రక్షాళన షురూ




