హైదరాబాద్: ఓయూ విద్యార్థి ఐకాస పిలుపుమేరకు జంట నగరాల్లో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఓయూ పరిసర ప్రాంతాలు మినహా యధావిధిగా నడుస్తున్నాయి. గణేష్ నిమజ్జనం, తెలంగాణ కవాతు నేపథ్యంలో రెండు రోజులుపాటు మూతపడ్డ వ్యాపార సంస్థలను ఇవాళ తెరిచే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నగరంలో గట్టిబందోబస్తు చేపట్టారు.




