హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో జగన్, మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిని పోలీసులు సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులకు రిమాండ్‌ను కోర్టు ఈ నెల 19 వరకు పొడగించింది. నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వీరిని భారీ భద్రత మధ్య జైలు నుంచి కోర్టుకు తరలించారు.




