ఎంపీలను బుజ్జగించేందుకే అఖిలపక్షం : తెదేపా
హైదరాబాద్: ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో ఓడిపోతామన్న భయంతోనే ఎంపీలను బుజ్జగించేందుకు అఖిలపక్షం ఏర్పాటుచేసే నిర్ణయం తీసుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తొలుత లేఖ రాసింది చంద్రబాబేనని, తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే మొదటి ఓటు తమదేనని తమ ఎంపీలు ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ హడావుడి చేసి నాన్చినట్లే షిండే తాజా ప్రకటన కూడా ఉందని ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు.



