హైదరాబాద్,మార్చి3(జనంసాక్షి): విపక్ష నేత జగన్ పై టిడిపి నేతలు మండిపడ్డారు.రెండు ,మూడేళ్లలో టిడిపి ప్రభుత్వం పడిపోతుందని జగన్ చెబుతున్నారని, ప్రభుత్వం అయితే పడిపోదు కాని, జగన్ మాత్రం రెండు,మూడేళ్లలో జైలుకు వెళతారని టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజధాని గ్రామాలలో భూములను తిరిగి ఇచ్చేస్తామని జగన్ అంటున్నారని, అంటే రాజధాని నిర్మాణం జగన్ కు ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచిసరైన ప్యాకేజీ రావడం లేదని కాంగ్రెస్ నాయకులు అయినా ప్రశ్నిస్తున్నారు కాని,జగన్ మాత్రం మాట్లాడడం లేదని ఆయన అన్నారు. వైఎస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై రైతుల నుంచి భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమిరెడ్డి విూడియాతో మాట్లాడారు. జగన్ రైతుల పరామర్శ యాత్రలు చేసే బదులు కాశీ యాత్ర చేపట్టాలని, చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు సంతోషంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదని, ఏపీ అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కాగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ భూ సవిూకరణ అంతా పూర్తి అయ్యాక జగన్ ఇప్పుడు భరోసా యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకాలం నిద్రపోయారా అని ఆయన అన్నారు.




