Wednesday, 4 November 2026

రియల్‌ కలలు కంటున్న బాబు : జగన్‌

హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): రాజధాని గ్రామాలలో భరోసా యాత్ర చేస్తున్న విపక్ష నేత జగన్‌ ట్విట్టర్‌ కూడా లో కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు తన రియల్‌ ఎస్టేట్‌ కలలను నెరవేర్చుకోడానికి ఒక బ్లూప్రింట్‌ తయారుచేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆ బ్లూ ప్రింటులో లక్షల మంది ప్రజల కలలను సమాధి చేస్తుండడాన్ని తాను చూస్తున్నానని జగన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే టిడిపి నేతలు జగన్‌ యాత్రపై విరుచుకుపడుతున్న నేపద్యంలో జగన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *