Tuesday, 3 November 2026

*జడ్చర్ల బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మంటపంలో శ్రీ మహాసుదర్శన యాగ కార్యక్రమాలు*

జనం సాక్షి జడ్చర్ల :-జడ్చర్ల బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో వాసవి కల్యాణ మంటపంలో శ్రీ మహాసుదర్శన యాగ కార్యక్రమాన్నీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతిసమేతంగా బ్రాహ్మణుల వేద మంత్రాల మధ్య శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ప్రజలు సుఖశాంతులతో గడపాలని కోరుతూ… రెండు రోజుల పాటు కొనసాగే ఈ మహాసుదర్శన యాగంలో ప్రజలు పాల్గొనలని కోరుతూ… ఈ మహదబాగ్యాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవలని తెలిపారు,అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మరియు గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు & టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్  పుట్టినరోజును పురస్కరించుకొని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పట్టణంలో ప్రజలు వారి ఇండ్ల పరిసరాల్లో మరియు పట్టణంలో కొత్త / పాత రెసిడెన్షియల్ లేఔట్ లలో మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. అంతకుముందు స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.*